![]() |
![]() |

జబర్దస్త్ లో వచ్చే వారం నుంచి నాగబాబు నవ్వులు మళ్ళీ వినిపించబోతున్నాయి. రీసెంట్ గా ఆ ప్రోమో రిలీజ్ అయ్యింది. నాగబాబు వచ్చారానో మరి ఏమో కానీ స్కిట్స్ లో కంటెస్టెంట్స్ ఎప్పుడూ లేనంత జోష్ గా కౌంటర్ లు వేశారు. పంచులు పేలాయి. ఇక ఎప్పటిలాగే నాగబాబు నవ్వు పక్కన ఇంద్రజ నవ్వుతో స్టేజి అంతా కళకళలాడిపోయింది.
ఐతే ఇక నుంచి రాబోయే జబర్దస్త్ ఎపిసోడ్స్ కి జడ్జిగా నాగబాబు కొనసాగుతారన్న విషయం రష్మీ కామెంట్స్ బట్టి తెలుస్తోంది. "ఇప్పటి వరకు ఒక లెక్క...ఈ వారం నుంచి మరో లెక్క " అనేసింది. "ది బాస్ ఈజ్ బ్యాక్ " అని చెప్తూ ఇన్వైట్ చేసింది. " ఆ చైర్ లోకి ఎంతమంది వచ్చినా ఆ చైర్ ఎప్పటికీ మీకే " అని కూడా చెప్పింది రష్మీ. "జబర్దస్త్ కి ఎప్పుడు దూరంగా ఉన్న షోకి ఎప్పుడూ దూరంగా లేను. నేను రెగ్యులర్ గా జబర్దస్త్ చూస్తూనే ఉంటాను. ఒక్కో సారి వీళ్ళు సరిగా చేయకపోతే లొకేషన్ కి వచ్చి మరీ కొట్టాలనిపిస్తుంది . కమెడియన్స్ లేకపోయినప్పుడు సినిమా ఇండస్ట్రీకి కమెడియన్స్ ని పంపించింది జబర్దస్త్. అది ఈ స్టేజికి ఉన్న వేల్యూ." అని చెప్పారు నాగబాబు. కమెడియన్స్ అంతా నాగబాబు కాళ్ళ మీద పడి ఆశీర్వాదం తీసుకున్నారు. జబర్దస్త్ నుంచి వెళ్ళిపోయాక పాలిటిక్స్ లో యాక్టివ్ గా ఉన్నారు. నాగబాబు 2019 లో వెళ్ళిపోయాక ఆయన ప్లేస్ లోకి మనో , కృష్ణ భగవాన్, ఖుష్బూ, సంఘవి వంటి వాళ్లంతా వచ్చారు కానీ ఎవరూ ఎక్కువ కాలం లేరు.
అలాగే షోలో కూడా యాంకర్స్ కూడా మారారు. చాలా మార్పులు జరిగాయి. ఇక ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ రీఎంట్రీ ఇచ్చేసరికి ఆ జోష్ అంతా కమెడియన్స్ లో కనిపిస్తోంది. ఇక ఈ ప్రోమో కింద నెటిజన్స్ ఐతే "మళ్ళీ చమ్మక్ చంద్ర, హైపర్ ఆది, సుడిగాలి సుధీర్ టీమ్స్ ని తీసుకురండి. అన్నయ్య వచ్చారు, మళ్ళీ ఓల్డ్ జబర్దస్త్ వచ్చేలా ఉంది. సుధీర్ అన్న, రోజా గారు వస్తె టిఆర్పి ఒక్క రోజులో పెరుగుతుంది. నాగబాబు గారు ఇంద్రజ గారితో జబర్దస్త్ ప్రోగ్రాం ఇప్పుడు చూడడానికి చాలా కనుల పండుగగా ఉంది. చమ్మక్ చంద్ర పాతవాళ్ళందరు రావాలి . జడ్జిమెంట్ విషయంలో నాగబాబు - రోజని ఎవరూ టచ్ చేయలేరు. మళ్ళీ రోజాని తేవాలి. నాగబాబు గారి పక్కన రోజా ఉంటేనే బాగుంటుంది .
![]() |
![]() |